హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ కామయ్యపేట గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాంగి సాకేత్ (8) అనే బాలుడు తన స్నేహితులతో కలిసి రాతులపుట్టు గెడ్డలో ఈతకు దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు వెంటనే బాలుడిని బయటకు తీసినప్పటికీ అప్పటికే మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకుంది.