మత్స్యగడ్డలో స్నానం.. బాలుడు గల్లంతు

ముంచింగిపుట్టు మండలం మాలిపుట్టు సమీపంలోని మత్స్యగడ్డలో స్నానానికి దిగిన తొమ్మిదో తరగతి విద్యార్థి లక్ష్మణ్ (15) గల్లంతయ్యాడు. గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు మిత్రులతో కలిసి స్నానానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. నీటిలోకి దిగిన లక్ష్మణ్ అకస్మాత్తుగా మునిగిపోవడంతో, తోటి మిత్రులు గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్