అరకులోయ మండల పరిసర ప్రాంతంలో వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అరకులోయ మండల పరిసర ప్రాంతంలో ఆదివారం వర్షం కురిసింది. ఉదయం నుంచి కురిసిన వర్షంతో వాతావరణం చల్లగా మారింది. అయితే వర్షం కారణంగా వాహనచోదకులు వ్యవసాయ పనులకు వెళ్లే వ్యవసాయ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వర్షంతో కూరగాయల విత్తనాలు వేసిన రైతులకు ఎంతో మేలు చేస్తుందని రైతులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్