పర్యటక కేంద్రమైన డుంబ్రిగుడ మండలంలో ఉన్న చాపరాయి జలపాతంలో ఆదివారం ఉదయం పర్యటకుల సందడి నెలకొంది. చాపరాయి జలపాతం వద్ద పర్యాటకులు సరదాగా జారుతూ స్నానాలు చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ మంత్రముగ్దులయ్యారు. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మూడు రోజులపాటు తుఫాన్ ఉందని అధికారులు హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో పర్యాటకులు తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు.