అరకులోయ ఏరియా ఆసుపత్రిలో నవజాత శిశువు మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. ఆసుపత్రి బాత్రూంలో శిశువు చనిపోయి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఓ మహిళ అక్కడే శిశువుకు జన్మనిచ్చి, విషయం బయటపడకుండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనను గమనించిన సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. శిశువు మృతి కారణాలు, తల్లి వివరాలపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.