అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కించయిపుట్ పంచాయతీ సరియపుట్టు గ్రామంలో రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను ముంచంగిపుట్టు మండలం టీడీపీ అధ్యక్షురాలు కిల్లో సన్యాసమ్మ (సంధ్య)శనివారం పంపిణీ చేశారు. పారదర్శకంగా రూపొందించిన ఈ పుస్తకాల ద్వారా భూ రికార్డుల తారుమారుకు ఆస్కారం ఉండదని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సీసా సుభాష్, పార్టీ నాయకులు బలరాం, రామస్వామి, మణి, లైకోన్, తదితరులు పాల్గొన్నారు.