అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీలోని కొత్తూరు పంచాయతీ శివలింగపురం, కృష్ణాపురం గ్రామాలలో 'పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా' పింఛన్ కార్యక్రమం గురువారం జరిగింది. మండల ఆర్గనైజేషన్ సెక్రటరీ భీమవరపు గంగులు, కొత్తూరు పంచాయతీ గ్రామకమిటీ అధ్యక్షులు దుంబరి కృష్ణ ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. పేదలు, వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, పేదల సంక్షేమానికి, సామాజిక భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని నాయకులు తెలిపారు.