అనంతగిరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడి పదవీకాలం ముగియడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అల్లూరి జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ స్వామినాయుడు శనివారం మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి మండలాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ నర్సింగరావు, ఎంఈఓలు కిల్లో బాలాజీ, బీబీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.