జి. మాడుగుల మండలంలోని బొయితేలి గ్రామంలో గిరిజనులకు తాగునీటి కష్టాలు తీరాయి. వారం రోజులుగా తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మండల ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి గిరిజనులు తీసుకెళ్లడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి మరమ్మత్తులకు గురైన సోలార్ మోటర్ ను మరమ్మతులు చేపట్టి తాగునీటి కష్టాలు తీర్చారు. దీనితో ఆర్డబ్ల్యూఎస్ అధికారి మురళినాయుడుకి బొయితేలి గిరిజనులు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు.