భారీ వర్షం.. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కేడీ పేట నుంచి కొయ్యూరు వెళ్లే హైవేపై భారీ వర్షం కారణంగా గురువారం కొండచరియలు విరిగిపడ్డాయి. కుండపోత వర్షంతో రహదారిపై నీరు చేరి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. అప్రమత్తంగా ఉండాలని, వర్షం సమయంలో వేగాన్ని తగ్గించి ప్రయాణించాలని స్థానికులు సూచించారు. అధికారులు రహదారి పరిస్థితులను పరిశీలించి, భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕