విశాఖపట్నంలోని మధురవాడ, ఆరిలోవ, విశాలాక్షి నగర్, బీచ్, మద్దిలపాలెం, ద్వారకానగర్, కాన్వెంట్, సిరిపురం, అక్కయ్యపాలెం వంటి ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ, వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం కురవడంతో స్థానికులు ఉపశమనం పొందారు. అయితే, వర్షం కారణంగా వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.