హుకుంపేట మండలంలోని మంగళవారం రాత్రి ప్రమాదం జరిగింది. డుంబ్రిగుడ మండలంలోని కితలంగి మాజీ ఎంపీటీసీ నారాయణరావు రంగశీలలో ఉన్న తన ఫ్రెండ్ తో కలిసి బైక్పై పాడేరు వైపు వెళ్తున్నారు. హుకుంపేట వైపు నుంచి వస్తున్న ఆటో బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మాజీ ఎంపిటిసి మృతిచెందగా తన ఫ్రెండ్ కి తీవ్ర గాయాలు కాగా 108లో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పంచనామ నిమిత్తం మృతదేహాన్ని పాడేరు ఆసుపత్రికి తరలించారు.