హుకుంపేట: బైక్ అదుపుతప్పి యువకుడికి తీవ్ర గాయాలు

హుకుంపేట మండలంలో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఉప్పల వైపు నుంచి ఓ యువకుడు బైక్ పై పాడేరు వెళ్తుండగా ఈ క్రమంలో మండలంలోని మారేలా సమీపంలోని మలుపు వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆటోలో హుకుంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన యువకుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్