అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలం, శోభకోట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కొర్ర కృష్ణారావు వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థుల్లో చురుకుదనాన్ని, ఉత్సాహాన్ని నింపుతున్నారు. పాఠశాలకు సొంతంగా రంగులు వేసి, ఆవరణను సుందరంగా మార్చి, మొక్కలు నాటి సుందరవనంగా తీర్చిదిద్దారు. ఈ మార్పులపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.