శోభకోట పాఠశాలలో వినూత్న బోధన, తల్లిదండ్రుల ప్రశంసలు

హుకుంపేట మండలం, శోభకోట గ్రామపంచాయతీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వినూత్న బోధన జరుగుతోంది. పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో ప్రత్యేక క్రీడా యూనిఫామ్, ఈ సంవత్సరం ఏకరూప స్వెటర్లు, ఐడి కార్డులు కూడా అందించారు. కృత్యాలు, ఆటపాటల ద్వారా బోధన జరుగుతుండగా, ఉపాధ్యాయులు కృష్ణారావు విద్యార్థులకు ఉత్సాహంగా బోధించడం వల్ల పిల్లలు చురుగ్గా చదువుతున్నారు. ఈ విషయం పట్ల గ్రామస్తులు ఉపాధ్యాయుని ఎంతగానో అభినందించారు. పాఠశాలను పచ్చగా, ఆకర్షణీయంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు.

సంబంధిత పోస్ట్

✕
✕