కొర్రపుట్ - జగదల్ పూర్ ప్యాసెంజర్ రైలు పునరుద్ధరణ

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొర్రపుట్ - జగదల్ పూర్ మధ్య తుఫాన్ కారణంగా రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో నిలిచిపోయిన ప్యాసెంజర్ రైలు సేవలను అరకు పార్లమెంట్ సభ్యురాలు డా. గుమ్మ తనూజ రాణి చొరవతో శుక్రవారం పునరుద్ధరించారు. బొర్రా ట్రైబల్ టాక్సీ యూనియన్ సభ్యులు తమ సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి, రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి రైలు రాకపోకలు పునరుద్ధరించేలా కృషి చేసినందుకు టాక్సీ–ఆటో డ్రైవర్లు, వాహన యజమానులు, చిరు హోటల్ వ్యాపారులు ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕