కొయ్యూరు మండలంలోని బాలారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గాదిరాజు రమణకు చెందిన కిరాణా దుకాణం పూర్తిగా కాలిపోయింది. దుకాణంతో పాటు అందులోని సరుకులు, సామాగ్రి కూడా అగ్నికి ఆహుతి కావడంతో సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా నిప్పు పెట్టారా అనే దానిపై స్పష్టత లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.