అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం, బొర్రా–కటికీ జలపాతం వద్ద రూ. 7 లక్షల వ్యయంతో నిర్మించిన 600 మీటర్ల సీసీ రోడ్డుకు గుత్తేదారులు నిబంధనల ప్రకారం 21 రోజులపాటు వాటరింగ్ చేయకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రోడ్డు త్వరగా దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన చెందుతూ, అధికారులు స్పందించి నాణ్యతను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.