మారేడుమిల్లి, రంపచోడవరం, వై రామవరం, అడ్డతీగల, చింతూరు ఏజెన్సీ ప్రాంతాల్లోని జలపాతాల వద్దకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. వలస, దుంప వలస, పాములేరు వాగు, సీతపల్లి కాలువ, పింజరికొండ జలపాతాల వద్దకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీస్, అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. జలపాతాల వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొని ఉన్నందున, పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.