పాడేరు కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంలో స్వీకరించిన గిరిజన సమస్యలు, వాటి పరిష్కార స్థితిపై ప్రతి నెలా నోటీసు బోర్డులో వివరాలు ప్రదర్శించాలని కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ సభ్యుడు పాచిపెంట చిన్నస్వామి డిమాండ్ చేశారు. ప్రజల అర్జీలు ఫైళ్లకే పరిమితం కాకుండా నిర్ణీత గడువులో పరిష్కారం కావాలని, 1/70 చట్ట ఉల్లంఘనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.