డుంబ్రిగూడ మండల పరిసర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి మేఘావృతమై వర్షం పడింది. కురిసిన వర్షంతో గ్రామ వీధులు జలమయమయ్యాయి. గత కొన్ని రోజులుగా ఎండ వేడితో ఉక్కపోతకు గురైన ప్రజలకు వర్షం కొంత ఉపశమనం కలిగించింది. రైతులు కూడా ఈ వర్షంపై ఆనందం వ్యక్తం చేశారు.