అరకులోయలో నోరూరిస్తున్న లిచీ పండ్లు

అరకులోయ మండలంలోని పద్మాపురం బొటానికల్ గార్డెన్లో దిగుబడికి వచ్చిన లిచీ పండ్లు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఎరుపు, గులాబి రంగుల్లో కనిపించే ఈ పండ్లు తీపి, పులుపుల మేళవింపుతో ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. ఈ ఏడాది లిచీ దిగుబడి బాగున్నప్పటికీ, ఇటీవల వీచిన బలమైన గాలుల కారణంగా గణనీయమైన పండ్లు రాలిపోయినట్లు గార్డెన్ సిబ్బంది తెలిపారు. బ్రిటిష్ పాలనా కాలంలోనే ఈ బొటానికల్ గార్డెన్లో లిచీ తోటను ఏర్పాటు చేయడం విశేషమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్