సొంత తమ్ముడినే అన్న బాణంతో పొడిచి చంపిన ఘటన ముంచంగిపుట్టు మండలంలోని ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ప్రకారం. మండలంలోని రంగబయలులో ఆదివారం ఉదయం ఆవు కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. ఈ ఘర్షణలో తమ్ముడు సీసా. కామేశ్వరరావును అన్న లైకోన్ బాణంతో పొడిచి చంపాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ రామకృష్ణ రంగబయలుకి చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.