అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీలోని ముంచంగిపుట్టు మండలం సుజనకోట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముంచంగిపుట్టు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కిల్లో సన్యాసమ్మ సంధ్య పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ పెన్షన్ల ద్వారా పేదలు ఆర్థికంగా సంతోషంగా ఉన్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శ్రవణ్, ప్రసాద్, నవీన్, సింహాచలం, సతీష్, ఒరిబొందు తదితరులు పాల్గొన్నారు.