పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట(మం)బడ్నాయిన వలస జంక్షన్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లూరి జిల్లా వాసి పరశురామ్ (55) మృతి చెందగా, ఈశ్వరరావు (35) గాయపడ్డారు. అనంతగిరి(మం)పెదకోట, రేగులపాలేలకు చెందిన వీరు కాగలగెడ్డలో వివాహవేడుకకు హాజరై తిరిగి వస్తుండగా, బైక్ బ్రేకులు ఫెయిల్ అవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పరశురామ్ అక్కడికక్కడే మరణించారు.