పెదకోటలో చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీలోని అనంతగిరి మండలం, పెదకోట పంచాయతీలో ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, సున్నా నుంచి ఐదు సంవత్సరాల వయసుగల చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. పిల్లలను పోలియో వ్యాధి బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, హెచ్ ఇ రవి శర్మ, హెచ్ ఎస్ రామకృష్ణ, ఎం ఎల్ హెచ్ పి పుష్పలత, ఆశ వర్కర్ దేవుడమ్మ, అంగన్వాడీ టీచర్ దాలమ్మ, అంగన్వాడి ఆయా రవణమ్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్