అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రోంపల్లి పంచాయతీ సచివాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల సిబ్బంది ముందు రోజే పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ అధికారుల పర్యవేక్షణలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగే ఈ ఓటింగ్ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.