అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీలోని అనంతగిరి మండలం, బొర్రా సచివాలయం పరిధిలోని సబ్ సెంటర్‌లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. బొర్రా, కోనాపురం గ్రామాలకు చెందిన 145 మంది చిన్నారులకు వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. 0-5 ఏళ్ల పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం అత్యవసరమని, ఇది వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి, అంగవైకల్యం రాకుండా కాపాడుతుందని ఏఎన్ఎం కళావతి తెలిపారు.