అనకాపల్లి జిల్లాలో రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త వి.గౌరి బుధవారం తెలిపారు. ఈ కాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.4 నుంచి 37.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.0 నుంచి 25.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో కూడా చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.