రాజవొమ్మంగి: 41మందికి పోలీసుల నోటీసులు

రాజవొమ్మంగి - ఏలేశ్వరం రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆందోళన చేపట్టిన 41 మంది గిరిజన సంఘం నాయకులకు పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. గత ఐదేళ్లుగా రోడ్డు పనులు పట్టించుకోవడం లేదని నిరసన తెలిపిన నాయకులకు నోటీసులు అందడం అన్యాయమని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు తెలిపారు. రోడ్డు నిర్మించే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్