మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా జీ. మాడుగుల మండలంలో శుక్రవారం వారపు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అమర వీరుల వారోత్సవాలు ఎవరికోసం అంటూ మా గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్న మావోయిస్టులు మాకు వద్దని ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అన్నలారా మీరు మా అభివృద్ధి గురించి ఆలోచించి గిరిజన గ్రామాల అభివృద్ధికి సహకరించాలని నినాదాలు పలికారు.