అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీలోని అనంతగిరి (మ) కొత్తవలస గిరిజన బాలుర పాఠశాల వసతి గృహం నిర్మాణానికి రూ. 2.70 కోట్లు మంజూరయ్యాయి. జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం చేయించి, సర్వశిక్షా అభియాన్ ద్వారా నిధులు మంజూరు చేయించడంలో మాజీ జడ్పీటీసీ దీసరి గంగరాజు కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి, బాగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అప్పలస్వామి, గిరిజన సంఘం మండల కార్యదర్శి జన్ని సుబ్బారావు, విద్యార్థులు పాల్గొన్నారు.