ఎస్.కోట: అరకు వెళ్లే దారిలో హెలికాప్టర్ రెస్టారెంట్..

ఆంధ్ర ఊటీ అరకు వెళ్లే రహదారిలో ఎస్.కోట మండలం బొడ్డవర సమీపంలో ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు హెలికాప్టర్‌ను పోలిన రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నారు. 16 మంది కూర్చొని విందు ఆరగించే సదుపాయం ఈ నమూనా హెలికాప్టర్‌లో ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. అరకు పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ఇది ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇది నిర్మాణ దశలో ఉంది.

సంబంధిత పోస్ట్