అడ్డుమండ సెగ్మెంట్ ఎంపీటీసీ సెట్టి మహేశ్వర్ రావు పదవీకాలం నేటితో ముగిసింది. పదవీకాలంలో గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. రహదారులు, తాగునీరు, విద్య, మౌలిక వసతులతో పాటు యువత, క్రీడలకు ప్రోత్సాహం అందించారు. పలు అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై అడ్డుమండ సెగ్మెంట్ అభివృద్ధికి కృషి చేసిన ఆయన సేవలను గ్రామస్తులు అభినందించారు. ఎంపీటీసీగా పదవీకాలం విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.