అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం, కొత్తపోయిపల్లి గ్రామంలో ఆదివాసీ మిత్ర సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళల కోసం ఇంటి వద్దనే చిన్న తరహా సబ్బుల తయారీ యూనిట్ ను ప్రారంభించారు. సంస్థ కోఆర్డినేటర్ ధర్మారావు, వార్డు మెంబర్ రాజారావు ఈ యూనిట్ ను ప్రారంభించారు. సంస్థ కోఆర్డినేటర్ భీముడు మాట్లాడుతూ, ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంటి వద్దనే సబ్బులు తయారు చేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.