అనంతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 30 ఏళ్లుగా హాస్టల్ భవనం లేకపోవడంతో ఆదివాసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జై భారత్ పార్టీ నేత చంటిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని విమర్శించారు. ఈ సమస్యపై ర్యాలీలు నిర్వహించినా పరిష్కారం దొరకకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.