ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా తీవ్ర ఎండల కారణంగా ఓ మహిళా కూలి సొమ్మసిల్లి పడిపోయిన ఘటన పెదబయలు మండలంలోని మర్రిపుట్టు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నతల్లి ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటుండగా ఎండ తీవ్రతను తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలింది. గమనించిన తోటి కూలీలు వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ రామరావుకు సమాచారం అందించారు. ఆయన స్పందించి బాధితురాలిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.