అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలోని అడ్డతీగల వద్ద 33 కేవీ విద్యుత్ లైన్‌పై బుధవారం భారీ చెట్టు కూలింది. ఈ ఘటనలో మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో అడ్డతీగల మండలంలోని పలు గ్రామాలతో పాటు, వై రామవరం మండలం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.