ఇటుకల పండగ తాడు తగిలి గిరిజన యువకునికి గాయాలు

హుకుంపేట మండలం రంగశిల పంచాయతీలో ఇటుకల పండగ సందర్భంగా రహదారికి అడ్డంగా కట్టిన తాడు కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. బైరొడివలస గ్రామానికి చెందిన కొర్ర ధర్మారావు బైక్‌పై వెళ్తుండగా తాడు గమనించక మెడకు తగిలి కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతనికి మెడకు గాయమైంది. ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు."

సంబంధిత పోస్ట్