24 పంచాయతీల్లో వీబీ–జీ రామ్ జీ గ్రామసభలు – ఏపీఓ సన్యాసినాయుడు

అనంతగిరి మండలంలో గల 24 గ్రామ పంచాయతీల్లో వీబీ–జీ రామ్ జీ ప్రత్యేక గ్రామసభలు అక్టోబర్ 2న నిర్వహించనున్నట్లు ఏపీఓ సన్యాసినాయుడు బుధవారం తెలిపారు. గ్రామసభల్లో 125 రోజుల ఉపాధి హామీ, పనుల కేటాయింపు, సకాలంలో వేతనాల చెల్లింపు, వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (VGPP), గ్రామాభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామసభల్లో ప్రజలు నేరుగా పాల్గొని కొత్త పనుల సూచనలు, సలహాలు అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕