ఎం. మాకవరం సచివాలయానికి చెందిన వెటర్నరీ అసిస్టెంట్ పెన్షన్ నిధులతో కలిసి అదృశ్యమయ్యాడని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మొత్తం రూ.2 లక్షల 81 వేల పెన్షన్ సొమ్ము మంజూరు అయినప్పటికీ, సంబంధిత అసిస్టెంట్ నిన్నటి నుంచే కనిపించడం లేదని ఎంపీడీవో ప్రసాదరావు వెల్లడించారు. ఎం. మాకవరం, చింతలపూడి పంచాయతీ కార్యదర్శులు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా, అంశాన్ని ఉన్నతాధికారులకు పంపించినట్లు ఆయన తెలిపారు.