విశాఖ: కేకే లైన్‌లో జారిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొత్తవలస-కిరండూల్‌ (కేకే) రైలు మార్గంలో ఆదివారం కొండచరియలు విరిగిపడటం వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు, బండరాళ్లు రైల్వే పట్టాలపై, ఓహెచ్‌సీ కేబుల్‌పై పడటంతో అవి దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన గూడ్స్, ప్యాసింజర్ రైళ్లను అధికారులు పలు స్టేషన్లలో నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్