అనంతగిరి మండలం బొర్రా – కోనాపురం ప్రధాన రహదారి వంతెనపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వంతెనపై మట్టి పేరుకుపోవడంతో నీరు సాఫీగా వెళ్లక ప్రమాదకర పరిస్థితి నెలకొంది. దీనితో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. సంబంధిత అధికారులు స్పందించి మట్టిని తొలగించి, వంతెనపై నీరు నిలవకుండా మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.