అల్లూరి జిల్లా జీకే వీధి మండలం సంకాడ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం పెళ్లి బృందంతో వెళ్తున్న బొలెరో వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు గిరిజనులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.