పద్మనాభం మండలంలోని పాండ్రంగి పంచాయతీలో బుధవారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో 14 వేల మందికి రూ. 6.34 కోట్ల పెన్షన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.