విశాఖకు చెందిన ఒలింపియన్ జ్యోతి యర్రాజి 2026 ఆసియా క్రీడలకు అర్హత సాధించి, నేషనల్ ఇంటర్-స్టేట్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. ఆమె ప్రతిభ, పోరాట పటిమకు ఇవి నిదర్శనమని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ అభినందించారు. జ్యోతి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు జగన్ ఎక్స్ వేదికగా తన అభినందనలు తెలిపారు.