చోడవరం పాఠశాలలో బాలికల భద్రతకు అభయ కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు

మహిళలు, బాలికల భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చోడవరం ZPHS బాలికల పాఠశాలలో అభయ కంప్లైంట్ బాక్స్‌ను బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ పి. అప్పలరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జీఎంఎస్‌కే సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో ఇలాంటి కంప్లైంట్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్