చోడవరం;ఘనంగా లక్ష్మీ గణపతి హోమం

మాఘ బహుళ చవితి సంకట హర చతుర్థి పర్వదినాన, చోడవరం లోని స్వయంభు శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గురువారం సామూహిక శ్రీ లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా జరిగింది. హోమానికి ముందుగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని, హోమాన్ని వీక్షించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్