చోడవరం: ఘర్షణలో గాయపడిన వ్యక్తి మృతి

చోడవరం బాలాజీ నగర్ వద్ద ఇందల సన్యాసిరావు, నెమల హరి మధ్య గొడవ ఈనెల మూడో తేదీన ఘర్షణ జరిగింది. ఆ గొడవలో నెమల హరి, ఇందల సన్యాసిరావును బలంగా చేతులతో కొట్టి, క్రిందకు పడవేశారు. దానితో సన్యాసిరావు కిందపడి తలకు బలమైన గాయమైంది. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 4వ తేదీన కేసు నమోదు చేసినట్టు సీఐ అప్పలరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న సన్యాసిరావు కేజీహెచ్లో మృతి చెందినట్లు బుధవారం సాయంత్రం తెలిపారు.

సంబంధిత పోస్ట్