చోడవరం: మానవత్వం చాటుకున్న జీపు డ్రైవర్

చోడవరం బాలాజీ నగర్ కి చెందిన సత్తిబాబు అనే జీపు డ్రైవర్ తన జీపులో ఒక ప్రయాణికుడు మర్చిపోయిన రూ.2.60 లక్షల నగదును ఆదివారం సాయంత్రం నిజాయితీగా ఆ ప్రయాణికుడికి అందించాడు. ఈనెల 12వ తేదీ సాయంత్రం ఒక ప్రయాణికుడు పాడేరు నుంచి చోడవరం జీపులో బయలుదేరాడు. తన దగ్గరున్న రూ.2,60,000లను బ్యాంకులో వేయాలని భావించి డబ్బు మర్చిపోయి జీప్ దిగి వెళ్లిపోగా ఆదివారం ఆ డబ్బును జీపు డ్రైవర్ ప్రయాణికుడికి అందజేశాడు.

సంబంధిత పోస్ట్